ఓటుతో ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పాలి: బుచ్చిరాజు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 15, 2024, 10:14 PM IST
Pensioners Association President Buchiraju about Pensions in Visakha: సకాలంలో సక్రమంగా ఓటు హక్కు వినియోగించుకుని ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్పాలని పింఛనదారుల సంఘం అధ్యక్షుడు బుచ్చిరాజు పేర్కొన్నారు. ఉపాధ్యాయ పింఛనదారుల (pensioners)కు రావలసిన బకాయిల (pendings)ను ప్రభుత్వం విడుదల చేయకపోవటంపై బుచ్చిరాజు మండిపడ్డారు. తొందరపడి ఎవ్వరూ సమ్మెలు చేయవద్దని తప్పనిసరిగా ఓటు (vote) తోటే ఈ సమస్యకు సమాధానం చెప్పాలిని పెన్షనుదారులను బుచ్చిరాజు కోరారు.
విశాఖ పింఛనదారులకు రావలసిన బకాయిలు, ఒకటో తేదీకి పెన్షన్, డీఏలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బుచ్చిరాజు విశాఖలో డిమాండ్ చేశారు. పలు సంఘాల నేతలు ధర్నాలు (Dharna), సమ్మె (strike)లు అంటూ ఇచ్చే పిలుపులు ఉపాధ్యాయ పింఛనదారులకు ఏ మాత్రం ప్రయోజనం కావని బుచ్చిరాజు పేర్కొన్నారు. నాలుగున్నర ఏళ్లుగా సమస్యలను పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేదని బుచ్చిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పనిసరిగా ఓటుతోనే దీనికి సమాధానం చెప్పాలని బుచ్చిరాజు పెన్షన్‌దారులను కోరారు.