ETV Bharat / state

స్వల్ప వివాదం - వ్యక్తిని లారీతో తొక్కించిన డ్రైవర్​ - SHOCKING FACTS IN ROAD ACCIDENT

ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం మిస్టరీని ఛేదించిన పోలీసులు - విచారణలో విస్తుబోయే నిజాలు

shocking_facts_in_road_accident
shocking_facts_in_road_accident (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 15, 2024, 8:44 PM IST

Police Solved Mystery of Road Accident Case: చిన్నపాటి వివాదం హత్యకు దారి తీసింది. బైక్​పై వెళ్తున్న వ్యక్తిని ఓడ్రైవర్, క్లీనర్ అత్యంత కిరాతకంగా లారీతో ఎక్కించి హత్య చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ చివరకు కటకటాలపాలయ్యారు. ముందుగా పోలీసులు రోడ్డు ప్రమాదంగా కేసు నమోదు చేసుకోగా విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి.

ఇదీ జరిగింది: పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 11వ తేదీన నాగపూర్ నుంచి కందిపప్పు లోడుతో బయలుదేరిన ఏపీ 39 టీ 0979 లారీ 12వ తేదీ రాత్రికి తెలంగాణలోని వైరాకు చేరింది. అక్కడి నుంచి మధిర మీదుగా విజయవాడకు వెళ్లే క్రమంలో వైరా దాటిన తర్వాత ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సోమయ్య అనే వ్యక్తి వాహనానికి లారీ స్వల్పంగా తాకింది. దీంతో ఆగ్రహం చెందిన సోమయ్య లారీని ఓవర్​టేక్ చేసి పాలడుగు వద్ద లారీ డ్రైవర్ రామిశెట్టి దుర్గారావుతో వాగ్వాదానికి దిగాడు. లారీ డ్రైవర్​ పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. ఖమ్మం జిల్లా కృష్ణాపురం దగ్గరకు వచ్చేసరికి సోమయ్య మళ్లీ ఓవర్​ టేక్​ చేసి లారీని అడ్డగించి తిరిగి వాగ్వాదానికి దిగాడు.

లారీ డ్రైవర్ ఎంత చెప్పినా సోమయ్య వినకపోవడంతో లారీ క్లీనర్ సూచనతో డ్రైవర్ దుర్గారావు సోమయ్యను వెనక నుంచి ఢీ కొట్టాడు. ఈ క్రమంలో కిందపడిన సోమయ్య పైనుంచి లారీని ఎక్కించగా తల పగిలి శరీరం చిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం డ్రైవర్​, క్లీనర్ లారీని ముందుకు తీసుకువెళ్లి దెందుకూరు దాటిన తర్వాత మూలమలుపు వద్ద ఎల్లమ్మ గుడి పక్కన లారీని నిలిపివేసి పారిపోయారు.

ఎలా చిక్కారంటే: ముందుగా రోడ్డు ప్రమాదంగా తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తరువాత ఢీకొన్న లారీని వెతకడం ప్రారంభించారు. చివరికి ఆ లారీని గుర్తించి దానిపై నిఘా పెట్టారు. ఆ లారీని తీసుకు వెళ్లేందుకు డ్రైవర్, క్లీనర్​ రాగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. దీంతో వారిద్దరిని విచారించగా అసలు విషయం బయటపడింది. తరువాత ఎస్సై లక్ష్మీ భార్గవి వారిద్దరిని అరెస్టు చేసి రిమాండ్​కు పంపించారు. చాకచక్యంగా కేసును రెండు రోజుల్లోనే ఛేదించిన రూరల్ ఎస్సై లక్ష్మీ భార్గవిని, సిబ్బందిని సీఐడి మధు అభినందించారు.

"చెన్నై ఎక్స్​ప్రెస్ మర్డర్ స్టోరీ" - తండ్రీ, కూతురు కలిసి మృతదేహాన్ని ముక్కలు కోసి!

ముగ్గురి దారుణ హత్య - భయంతో తలుపులు పెట్టుకున్న గ్రామస్థులు - పోలీసులు వెళ్లేవరకూ ఇళ్లలోనే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.