ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఉప్పొంగిన పెన్నా - కడప జిల్లా మీదుగా పోటెత్తిన వరద - FLOOD IN KADAPA

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 18, 2024, 12:21 PM IST

Water scarcity in Penna River : తుపాను ప్రభావంతో వాగులు, వంకలు పోటెత్తడంతో కడప జిల్లా మీదుగా పెన్నా నది ఉరకలు వేస్తోంది. నిన్న ఉదయం 20,000 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉన్న ఈ నది సాయంత్రానికి సుమారుగా 30 వేల క్యూసెక్కులకు పెరగడం గమనార్హం. అయితే ఈరోజు ఉదయం 40,000 క్యూసెక్కులు ప్రవహిస్తున్నట్లు నదీ ఆవరణాన్ని సందర్శించిన అధికారులు ప్రకటించారు.

ఉత్తర భాగాన జయమంగళి, కుందేరు, సగిలేరు, దక్షిణాన చిత్రావతి, పాపాగ్ని, చెయ్యేరు నదులు పెన్నానదికి ప్రధాన ఉపనదులుగా ఉన్నాయి. అయితే పెన్నా నదికి ఉపనదులుగా ఉన్న పాపాగ్ని ,కుందేరు నదుల వైఎస్సార్ జిల్లా కడపలో ఉండగా వీటి నుంచి వెలువడిన వరద పెద్ద ఎత్తున  చేరుతూ ఉండడంతో ఆదినిమ్మాయ పల్లె వద్ద అంతకంతకూ నీటి ప్రభావం పెరుగుతోంది. దీని వలన ఈ ప్రాంతంలో నివాసముండే ప్రజలు నది కోతకు గురై ఎక్కడ ప్రమాదం వచ్చి పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details