'గవర్నర్ ప్రసంగంలో బటన్ నొక్కుడు అంశాలే - అభివృద్ధి ఎక్కడ ?'
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 5, 2024, 10:41 PM IST
PDF MLCs Fires On Governer Speech in vijayawada : గవర్నర్ ప్రసంగంలో బటన్ నొక్కుడు అంశాలను తప్పితే రాష్ట్ర అభివృద్ధి గురించి చెప్పలేదని పీడీఎఫ్ ఎమ్మెల్సీ కె. లక్ష్మణరావు అన్నారు. విద్యాశాఖ నియామకాలు, అభ్యున్నతి, జాబ్ క్యాలెండర్ గురించి గవర్నర్ మాట్లాడలేదని మండిపడ్డారు. సాగు నీటి ప్రాజెక్టుల గురించి, పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పలేదన్నారు. గవర్నర్ ప్రసంగంలో ఉద్యోగుల పెండిగ్ బకాయిల గురించి ప్రస్తావించలేదని ఎమ్మెల్సీ ఐ. వెంకటేశ్వరావు అన్నారు. రాష్ట్ర ప్రజలను నిరాశ కలిగించేలా గవర్నర్ ప్రసంగం (Governer Speech) ఉందని ఎమ్మెల్సీ ఐ. వెంకటేశ్వరావు వ్యాఖ్యానించారు.
మొదటి పది పేజీల్లో విద్యారంగం గురించి, రెండు పేజీ మహిళా, శిశు సంక్షేమం గురించి, అమలు పథకాలు కానీ అంగన్వాడీలకు సంబంధించిన అంశాలు లేవని మండిపడ్డారు. నీటి పారుదల, సాగు గురించి ఉన్నప్పటికీ కేవలం ప్రాజెక్టుల పేర్లే తప్ప మరో అంశం లేదని లక్ష్మణ రావు ధ్వజమెత్తారు.