ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

Pawan Live జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రసంగం- ప్రత్యక్ష ప్రసారం - Jana Sena Foundation Day

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 14, 2024, 2:03 PM IST

Updated : Mar 14, 2024, 3:15 PM IST

Jana Sena Foundation Day : జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించనున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడమే జనసేన పార్టీ లక్ష్యమని ఆ పార్టీ సీనియర్‌ నేత నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అధికార అహంకారంతో ప్రభుత్వం కొట్టుమిట్టాడుతోందని ఆయన ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జగన్ అహంకారం, సామాన్యుల ఆత్మగౌరవానికి పోరాటమే జనసేన ఆవిర్భావ సభ అన్నారు. జనసేన ఆవిర్భావసభలో పవన్ జనసైనికులకు పవన్ దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. ప్రతిపక్షంగా ప్రజాసమస్యలపై పోరాడాల్సిన బాధ్యత మాకుంది. సభకు ఆటంకం కలిగించవద్దని అధికారులను కోరుతున్నా. రాష్ట్రానికి మేలు జరగాలని కోరుకునే వ్యక్తి పవన్‌. వచ్చే ఎన్నికలకు ఎలా సిద్ధమవ్వాలో పవన్ దిశానిర్దేశం చేస్తారు. జగన్ అహంకారం, సామాన్యుల ఆత్మగౌరవానికి పోరాటమే ఈ సభ. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడమే జనసేన పార్టీ లక్ష్యం. అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. 
Last Updated : Mar 14, 2024, 3:15 PM IST

ABOUT THE AUTHOR

...view details