ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కిరాయి మూకలు నన్ను, నా సిబ్బందినీ బ్లేడుతో కోస్తున్నారు: పవన్‌కల్యాణ్‌ - Pawan kalyan comments on YSRCP - PAWAN KALYAN COMMENTS ON YSRCP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 2, 2024, 11:33 AM IST

Pawan kalyan Comments on YSRCP at Pithapuram: కిరాయి మూకలు తనను, తన భద్రత సిబ్బందిని బ్లేడుతో కోస్తున్నారని అందుకే ప్రోటోకాల్ (Protocol) పాటించాల్సిన అవసరం వచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేనలో చేరిన వైఎస్సార్సీపీ శ్రేణులను ఉద్దేశించి పవన్ ప్రసంగించారు. అందరితో ఫొటో దిగాలని ఉందని కానీ కొందరు కిరాయి మూకలు తనపైన, సిబ్బందిపైన బ్లేడుతో సన్నగా కోస్తున్నారని అన్నారు. అధికార పార్టీ పన్నాగాలు దృష్టిలో ఉంచుకునే భద్రత మరింత కట్టుదిట్టం చేశామని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

పిఠాపురంలో జనసేనలో చేరిన 100 మందికి పైగా నాయకులు కండువా కప్పి పార్టీలోకి పవన్ కల్యాణ్ ఆహ్వానించారు. అనంతరం పవన్ మాట్లాడుతూ మీ కోసమే ఇక్కడికి వచ్చానని అందరికీ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు (Alliance) గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మన కూటమి ప్రభుత్వమే అధికారంలోకి రాబోతోంది అన్నారు. మీ నినాదాలు, జయ జయధ్వానాలే కదా పార్టీకి శక్తి అంటూ శ్రేణులను ఉత్సాహపరిచారు. వైఎస్సార్సీపీలో కష్టపడి పనిచేసినా గుర్తింపులేదని ఎంపీటీసీ సభ్యులు తెలిపారని జనసేనలో కష్టపడితే గుర్తింపు ఇస్తానని భరోసా ఇచ్చామని పవన్ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details