ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రాయితీలు, ప్రోత్సాహక నగదు చెల్లించాలి- పట్టు రైతుల నిరసన - reelers protest

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 20, 2024, 7:17 PM IST

Pattu Raithulu Protest In Hindupur: పట్టు రైతులకు, రీలర్లకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డ రాయితీలు, ప్రోత్సాహక నగదును వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో పట్టు రైతులు చేస్తున్న సమ్మె నాలుగో రోజు కొనసాగుతున్నాయి. పట్టుగూళ్ల మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి పాల్గొన్నారు. రైతులు, రీలర్లు పట్టుగూళ్ల మార్కెట్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసనగా ర్యాలీ చేపట్టారు.

ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ నాలుగు రోజులుగా పట్టు పరిశ్రమకు సంబంధించిన రైతులు రీలర్లు నిరువధిక సమ్మె కొనసాగిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్​కు చీమకుట్టినట్టు అయినా లేదా అని ప్రశ్నించారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పట్టు రైతుల సమస్యల గురించి రైతులు, రీలర్లు యువనేత దృష్టికి తీసుకెళ్లారని తిప్పేస్వామి తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పట్టు రైతుల రీలర్ల సమస్యలు పరిష్కరిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి పదవి కాలం ఇంకా మూడు నెలలు ఉంది కాబట్టి పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని తిప్పేస్వామి డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details