LIVE : లోక్‌సభ సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం - Lok Sabha Sessions Live
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 2, 2024, 11:07 AM IST
|Updated : Jul 2, 2024, 6:51 PM IST
Lok Sabha Sessions 2024 Live : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు కొనసాగుతున్నాయి. సోమవారం రోజున లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ మొదట చర్చను ప్రారంభించారు. ఈ చర్చ సందర్భంగా హిందుత్వ అంశంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికి దారితీశాయి. సోమవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై, చర్చ సందర్భంగా రాజ్యాంగంపై దాడి జరుగుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. అన్ని మతాలు ధైర్యంగా ఉండమనే ప్రబోధిస్తున్నాయని రాహుల్ వివరించారు. అయితే హిందువులుగా చెప్పుకుంటున్న వారు 24 గంటలూ కేవలం అహింస, ద్వేషం, అసత్యమే మాట్లాడుతున్నారని, మీరు అసలు హిందువులేనా అని రాహుల్ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ, అధికార పక్ష నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ నేపథ్యంలో రాహుల్ ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించినట్లు లోక్‌సభ సెక్రటేరియట్ వెల్లడించింది. సభాపతి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సోమవారం వాయిదా పడిన సమావేశాలు తిరిగి ఇవాళ కొనసాగుతున్నాయి.
Last Updated : Jul 2, 2024, 6:51 PM IST