పట్టుదల, కృషి - అద్భుతాలు సృష్టిస్తున్న వారిజ నేత్ర విద్యాలయ విద్యార్థులు - VARIJA NETRA VIDYALAYA - VARIJA NETRA VIDYALAYA
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 1, 2024, 11:54 AM IST
Para Athletes Champions on Varija Netra Vidyalaya Students in Visakha : అంధత్వం ఉంటేనేమీ, అవకాశం వస్తే మేము సైతం అద్భుతాలు సృష్టించగలమంటున్నారు వారిజ నేత్ర విద్యాలయ దివ్యాంగ విద్యార్థులు. చదువుతో పాటు క్రీడల్లోనూ తమదైన మార్క్ చూపిస్తున్నారు. ఇటీవల జరిగిన పారా అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో పతకాలతో అదరగొట్టారు. పట్టుదల, సాధించాలని కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చనీ నిరూపిస్తున్నారు. వైకల్యాన్ని విడనాడి విజయం సాధించలనే సంకల్పంతో అంతర్జాతీయ టోర్నమెంట్లలో సత్తా చాటేందుకు సన్నద్ధమవుతున్నారు.
టీచర్స్, కోచ్‌ల ప్రోత్సాహంతో ఉదయం చదువు, సాయంత్రం ఆటల్లో శిక్ష పొందుతున్నామని విద్యార్థులు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో ఇప్పటి వరకు 17 పతకాలు సాధించామని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. వివిధ పోటీల్లో పాల్గొని 7 పసిడి, ఒక రజతం, 9 కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. రన్నింగ్, షాట్‌పుట్, హైజంప్ తదితర విభాగాల్లో పతకాలు సాధించారని పేర్కొన్నారు. అంతర్జాతీయ పారా గేమ్స్‌లో పాల్గొని విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలియజేశారు.