తెలంగాణ

telangana

ETV Bharat / videos

​అవిశ్వాసం వీగడంతో ఆర్మూర్ మున్సిపల్​ ఛైర్‌పర్సన్​గా బాధ్యతలు చేపట్టిన పండిత్ వినీత - Chairperson Pandit Vineeta Pawan

By ETV Bharat Telangana Team

Published : Feb 5, 2024, 5:14 PM IST

Pandit Vinitha Pavan As Armoor Municipal Chairperson : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ ఛైర్​ పర్సన్​పై గత నెల 4వ తేదీన పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో, ఇవాళ మున్సిపల్ ఛైర్ పర్సన్​గా పండిత్ వినీత పవన్ బాధ్యతలు చేపట్టారు. గతంలో బీఆర్​ఎస్​ పార్టీ నుంచి మున్సిపల్​ ఛైర్​ పర్సన్​గా ఎన్నికైన ఆమె, ప్రస్తుతం ఇండిపెండెంట్​గా కొనసాగుతానని స్పష్టం చేశారు.  

Armoor Municipal Chairperson Vinitha Pavan : రానున్న రోజుల్లో ఏ పార్టీలో చేరతానో త్వరలో స్పష్టత ఇస్తానని మున్సిపల్​ ఛైర్​ పర్సన్​ పండిత్​ వినీత పవన్​ తెలిపారు. మున్సిపల్​ ఛైర్​ పర్సన్​గా తను అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. కొంత మంది కౌన్సిలర్లు కావాలని తనపై అవిశ్వాసం పెట్టారని ఆరోపించారు. తనపై పెట్టిన ఆవిశ్వాస తీర్మానం వీగి నిజాయతీ గెలిచిందని అన్నారు. ఇంకా ఒక సంత్సరంపాటు ఆర్మూర్ పట్టణ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ వినీత పవన్ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details