ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మాజీ మంత్రి రజనీ అవినీతి దందా- హోంమంత్రికి ఫిర్యాదు చేసిన బాధితులు - Complaint on Vidadala Rajini - COMPLAINT ON VIDADALA RAJINI

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 19, 2024, 5:35 PM IST

Complaint on Vidadala Rajini : మాజీ మంత్రి విడదల రజినీపై పల్నాడు జిల్లా స్టోన్ క్రషర్ యాజమాన్యం హోం మంత్రి అనితకు ఫిర్యాదు చేసింది. విడుదల రజినీ అక్రమాలకు పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేయగా మంత్రి అనిత సానుకూలంగా స్పందించారు. విడుదల రజినీ అక్రమాలపై విచారణకు హోంమంత్రి ఆదేశించారు. మాజీ మంత్రి విడుదల రజినీ, అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా, రజినీ పిఏ గోపి కలిసి 2.50 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు పల్నాడు జిల్లా యడ్లపాడు బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యం నుంచి ఫిర్యాదులో పేర్కొంది. తమకు న్యాయం చేయాలని ఫిర్యాదుదారులు హోం మంత్రిని కోరారు.

మంత్రి విడదల రజిని అవినీతి బాగోతం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. చిలకలూరిపేట నియోజకవర్గం పసుమర్రు గ్రామంలో ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ప్రకారం ఎకరా రూ12 లక్షలు పలకగా జగనన్న ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వానికి ఇస్తే ఎకరాకు 31 లక్షలు ఇప్పిస్తానంటూ మంత్రి రజిని రైతులకు ఎరవేశారని ఆరోపణలు ఉన్నాయి. మొదటి రెండు విడతల్లో 50 ఎకరాలు సేకరించగా ఎకరాకు రెండున్నర లక్షల చొప్పున కోటీ 16 లక్షలు రైతుల నుంచి వసూలు చేసినట్లు సమాచారం. మూడు, నాలుగు విడతల్లో 100 ఎకరాల వరకు సేకరించగా ఎకరాకు ఏడున్నర లక్షలు చొప్పున ఏడున్నర కోట్లు ఇవ్వాలంటూ రైతుల నుంచి ముందుగానే చెక్కులు, నోట్లు తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details