ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రయ్​మంటూ రావాల్సిన అంబులెన్స్​ ఆలస్యం - వృద్ధుడు మృతి - Old Man Dies Due to Ambulance Delay

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 1, 2024, 8:25 PM IST

Old Man Dies Due to Ambulance Delay in Sri Satya Sai District : శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం జమ్మానిపల్లిలో అంబులెన్స్ ఆలస్యంగా రావడంతో నరసింహప్ప అనే వృద్ధుడు మృతి చెందాడు. నరసింహప్పకు తీవ్ర కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేందుకు 108 వాహనానికి ఫోన్‌ చేశారు. వృద్ధుడు తీవ్ర కడుపు నొప్పితో చాలాసేపు కొట్టుమిట్టాడాడు. ఒక్కసారిగా అతనిలో కదలికలు లేకపోవడంతో ప్రైవేట్ వాహనంలో మడకశిరలోని ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. 

అంతలోనే అక్కడికి వచ్చిన ఆంబులెన్సు సిబ్బంది పరీక్షించి నరసింహప్ప మృతి చెందాడని తెలపడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సరైన సమయంలో ఆంబులెన్సు వచ్చి ఉంటే అతడి ప్రాణాలు దక్కేవని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తపరిచారు. ఆంబులెన్సు సిబ్బంది అలసత్వం కారణంగానే నరసింహప్ప చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఉచితాలు అందించే కన్నా విద్య, వైద్యసేవలకు ఎలాంటి ఆటుపోట్లు లేకుండా వాటిని ముందుకు తీసుకెళ్లాలని గ్రామస్థులు కోరుతున్నారు. వృద్ధుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఆంబులెన్సు ఆలస్యంగా రావడంతో ప్రథమ చికిత్స అందక మా చిన్నాన్న చనిపోవడం జరిగింది. 2018లో కూడా ఇదే విధంగా చిన్న బాలుడు అర్థరాత్రి సమయంలో వైద్యం కోసం ఆంబులెన్సుకు సమాచారం ఇస్తే రావడానికి ఆలస్యమవడంతో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. గ్రామాల్లో అర్థరాత్రి సమయంలో కూడా వైద్యం అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నాం - మురళీ ,మృతుని బంధువు

ABOUT THE AUTHOR

...view details