ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

జనం మీదకు దూసుకెళ్లిన ఎద్దులు, వ్యక్తి మృతి- పశువుల పండగలో విషాదం - Cattle festival in Chandragiri

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 25, 2024, 8:15 PM IST

Old Man Died in Cattle Festival at Chandragiri: తిరుపతి జిల్లా చంద్రగిరిలో జరిగిన పశువుల పండుగలో అపశృతి చోటు చేసుకుంది. తిలకించడానికి వచ్చిన వృద్ధుడిని ఎద్దు గుద్దడంతో వెంకట ముని అనే వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సంక్రాంతి పండుగ జరిగి నెల రోజులు కావస్తున్న పశువుల పండుగలు మాత్రం చంద్రగిరి మండలంలో జరుగుతూనే ఉన్నాయి. చంద్రగిరిలో ఆదివారం మధ్యాహ్నం పశువుల పండుగను నిర్వహించారు. గత వారం రోజులుగా చుట్టుపక్కల గ్రామస్థులకు పశువులు పండుగ గూర్చి తెలియజేసి వారిని పండుగలో పాల్గొనాల్సిందిగా నిర్వాహకులు కోరారు. ఈ క్రమంలో చుట్టుపక్కల ఉన్న వారు సుమారు 150 ఎడ్లు జతలతో పాల్గొన్నారు. చంద్రగిరిలో మొదటిసారిగా పశువులు పండగ నిర్వహిస్తున్నందున చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక జిల్లా వ్యాప్తంగా భారీగా ప్రజలు యువకులు తరలివచ్చారు. ఈ క్రమంలో ఓ ఎద్దు జనాలపైకి రావడంతో నడింపల్లికి చెందిన వెంకట ముని(60) అనే వృద్ధుడిని చాతిపై గుద్దడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. హుటాహుటిన స్థానికులు తిరుపతి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ వెంకట ముని మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details