కలెక్టరేట్లో వృద్దుడి వద్ద కత్తి- ఉలిక్కిపడ్డ అధికారులు - Old Man in Collectorate With knife - OLD MAN IN COLLECTORATE WITH KNIFE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 9, 2024, 4:43 PM IST
Old Man Came to the Collectorate With knife in Satya Sai District : శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో (Public Grievance Redressal System) ఓ వృద్దుడి వద్ద కత్తి ఉండటం కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ చేతన్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. ఈ క్రమంలో పాముదుర్తి పంచాయతీ చింతలయ్య గారి పల్లెకు చెందిన రామనారాయణ అనే వృద్ధుడు భూ తగాదాలకు సంబంధించి సమస్య గురించి కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చారు. వినతి అందించడానికి వచ్చిన వృద్ధుడి వద్ద తనిఖీలో చాకు లభించింది.
పోలీసులు రామనారాయణ నుంచి చాకును స్వాధీనం చేసుకున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కలెక్టరేట్‌కి వచ్చిన ఫిర్యాదుదారులందరినీ ముమ్మురంగా తనిఖీలు చేశారు. పోలీసులు వృద్ధుడిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనతో ఒక్క సారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. అయితే భూ సంబంధిత సమస్య కాబట్టి ప్రత్యర్థులు దాడి చేసే అవకాశం ఉందని కత్తి వెంట తెచ్చుకున్నాని వృద్దుడు తెలిపినట్లు సమాచారం.