LIVE "రామోజీరావు - మీడియా మహానాయక్" కార్యక్రమం - ఒడిశా నుంచి ప్రత్యక్షప్రసారం - Odisha Media Tribute to Ramoji Rao - ODISHA MEDIA TRIBUTE TO RAMOJI RAO
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 18, 2024, 6:49 PM IST
|Updated : Jun 18, 2024, 8:08 PM IST
Odisha Media Parivar Tribute to Ramoji Rao Live : రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావుకు ఒడిశా మీడియా ప్రతినిధులు నివాళులర్పించారు. భువనేశ్వర్లో పలువురు సీనియర్ జర్నలిస్టులు, ప్రముఖ పాత్రికేయలు అక్షరయోధుడి మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈటీవీ ఒరియాలో పనిచేసిన ఉద్యోగులు రామోజీరావును స్మరించుకుంటున్నారు. ఈ క్రమంలోనే "రామోజీరావు - మీడియా మహానాయక్" అను కార్యక్రమం నిర్వహించి మాట్లాడుతున్నారు. భారత దేశంలో మీడియా రంగానికి రామోజీరావు దార్శనికుడని ఈటీవీ ఒడియా మాజీ ఉద్యోగులు ప్రవాకర్ దలై, దీనా భంజన్ పండా కొనియాడారు. పత్రికా రంగంలో రామోజీ సరికొత్త ఒరవడి సృష్టించారని గుర్తు చేసుకున్నారు. ప్రింట్, టీవీ, డిజిటల్ మీడియాలో కొత్త శకానికి నాంది రామోజీ పలికారని తెలిపారు. అడుగుపెట్టిన ప్రతి రంగంలో కూడా ఆయన చెరగని ముద్ర వేశారని చెప్పారు. ఆయన మరణం యావత్ మీడియా రంగానికి తీరని లోటని చెప్పారు. అక్షర యోధుడికి నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు.
Last Updated : Jun 18, 2024, 8:08 PM IST