ఆక్టోపస్ కమాండోలు వాడే ఆయుధాలు చూశారా? వాటి ప్రత్యేకతలు తెలుసా! - OPEN HOUSE PROGRAM IN VIJAYAWADA
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 26, 2024, 5:06 PM IST
Octopus Weapons Open House Program Organized in Vijayawada : విజయవాడలో నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమం విద్యార్థులను ఏంతో ఆకట్టుకుంది. ఆక్టోపస్ కమాండోలు ఉపయోగించే అధునాతన ఆయుధాలను ప్రజల సందర్శన కోసం అందుబాటులో ఉంచారు. 2007లో ఏర్పాటైన ఆక్టోపస్ రాష్ట్ర పోలీసు వ్యవస్థలోనే ప్రత్యేకమైనది.
శత్రువు నుంచి ముప్పు పొంచి ఉందంటే చాలు మూడో కంటికి తెలియకుండా మట్టుపెడతారు. భద్రతా సిబ్బంది జాడే తెలియకుండా ఉగ్రమూకల భరతం పట్టేస్తారు. అర్బన్ వార్ ఫేర్ మెళకువలు, యుద్ధతంత్రాల్లో తర్ఫీదు పొందిన నిష్ణాతులే వారంతా. వ్యూహాత్మక ఆయుధాలతో సాంకేతిక మిళితమైన పరికరాలతో ఆ కమాండోలు విధులు నిర్వహిస్తుంటారు. ఆర్గనైజేషన్ ఫర్ కౌంటరు టెర్రరిస్టు ఆపరేషన్స్ (ఆక్టోపస్) అనేది రాష్ట్ర పోలీసుల ప్రత్యేక విభాగం. గ్లాక్-19 ఫిస్టల్స్, కోల్ట్ 9ఎంఎం ఎస్‌ఎంజీ, స్నిప్పర్ రైఫిల్స్, కార్నర్ షాట్ వెపన్ సిస్టమ్స్‌తోపాటు ఇతర ఆధునిక ఆయుధాలను విజయవాడలో ఆక్టోపస్ బలగాలు ప్రజల సందర్శనార్ధం ఉంచారు. వారు ఉపయోగించే ఆయుధాల ప్రత్యేకత ఏమిటి? ఎలా పని చేస్తాయో ఇప్పుడు చూద్దాం.