ఎన్‌ఆర్‌ఐ స్థలం కబ్జా - కేసు నమోదు చేస్తామని కమిషనర్ హామీ - NRI Couple Complaint - NRI COUPLE COMPLAINT
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 13, 2024, 10:25 AM IST
NRI Couple Complaint in Visakha District : విశాఖ జిల్లా పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని మైత్రినగర్‌లో ఉన్న తమ స్థలాన్ని రౌడీ షీటర్లు ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని ఎన్‌ఆర్‌ఐ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 1998లో సర్వే నంబర్ 164-1A లో 2 ప్లాట్లను కొనుగోలు చేశామని తెలిపారు. 2014 వరకు అవి తమ దగ్గరే ఉన్నాయని దంపతులు తెలిపారు. స్థలంలో గేట్లు పెట్టుకొంటుంటే రౌడీమూక వచ్చి దాడికి యత్నించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ మొబైల్ ఫోన్లను లాక్కెళ్లిపోయారని ఎన్‌ఆర్‌ఐ దంపతులు వాపోయారు.
విశాఖలో రౌడీ షీటర్ల పై నిఘా పెంచి కేసులు నమోదు చేస్తామని నగర పోలీస్ కమిషనర్ హామీ ఇచ్చినట్లు ఎన్‌ఆర్‌ఐ దంపతులు వివరించారు. తమ ప్లాట్ల ఆక్రమణలో కీలక సూత్రధారి డుంబూరి ప్రభాకర్ అని వెల్లడించారు. భూ కబ్జాలకు పాల్పడుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదని సీపీ వారితో పేర్కొన్నారు. రౌడీ షీటర్ల నుంచి తమకు ప్రాణహాని ఉందని సీపీకి వివరించారు. తమ ఆస్తికి, ప్రాణాలకు రక్షణ కల్పించాలని ఎన్‌ఆర్‌ఐ దంపతులు పోలీసులను వేడుకున్నారు.