ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్మలా సీతారామన్‌ పర్యటన - డిజిటల్‌ కమ్యూనిటీ సెంటర్‌ సందర్శన - Nirmala Sitharaman ap tour

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 20, 2024, 10:51 PM IST

Nirmala Sitharaman Visit Digital Centre in West Godavari District : పశ్చిమ గోదావరి జిల్లాలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పర్యటించారు. ఈ సందర్భంగా నరసాపురం మండలం పీఎంలంక డిజిటల్‌ కమ్యూనిటీ సెంటర్‌ను మంత్రి సందర్శించారు. వృత్తి నైపుణ్య శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ముచ్చటించారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంలో భాగంగా శిక్షణ పొందిన మహిళలతో మాట్లాడి వారికి సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. అనంతరం నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఆదర్శ సంసద్ గ్రామ్ యోజన పథకంలో భాగాంగా నేను పీఎంలంకను దత్తత తీసుకోవడం కాదు ఈ గ్రామస్థులే నన్ను దత్తత తీసుకున్నారని తెలిపారు. మెుదటి సారి ఈ గ్రామాన్ని సందర్శించినప్పడు, మా భార్తలు మద్యంతాగి వచ్చి కొడితే పిల్లలో కలిసి తాము ఎక్కడికి వెళ్లాలో తెలియడంలేదని మహిళలు తనకు చెప్పిన విషయం గుర్తుచేశారు. 

ఇప్పుడు డిజిటల్ భవనం నిర్మించాక మీ కుటుంబాల్లో మార్పు వచ్చిందా అని ఆమె మహిళలను ప్రశ్నించారు. అలాగే ఈ డిజిటల్ కేంద్రంతో వందలాది మంది ఇక్కడ శిక్షణపొంది ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పోందారని తెలిపారు.  పీఎంలంకలో సముద్ర కోత నివారణకు కేంద్రం చర్యలు చేపడుతోందని, రక్షణగోడ నిర్మాణానికి టెండరు ఖరారు చేసినట్లు తెలిపారు. త్వరలో నిర్మాణపనులు ప్రారంభమవుతాయన్న మంత్రి, దేశీయ స్థాయిలో ఇది మొదటి ప్రయోగాత్మక ప్రాజెక్టు అని చెప్పారు. ఇక్కడ ప్రయోగాత్మకంగా చేపట్టనున్న రక్షణ చర్యలు జాతీయస్థాయికి మార్గదర్శకం అవుతాయన్నారు. 

ABOUT THE AUTHOR

...view details