తెలంగాణ

telangana

ETV Bharat / videos

యజమాని చెర నుంచి బయటపడ్డ గల్ఫ్ బాధితుడు - సర్కార్ చొరవతో క్షేమంగా ఇంటికి - Nirmal District Gulf Victim - NIRMAL DISTRICT GULF VICTIM

By ETV Bharat Telangana Team

Published : Oct 1, 2024, 5:35 PM IST

Nirmal District Gulf Victim Came To Hyderabad : బతుకుదెరువు కోసం ఖండాంతరాలు దాటి సౌదీకి వెళ్లిన ఓ వ్యక్తి, అక్కడ పడరాని పాట్లు పడ్డాడు. విదేశంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా వీడియో సందేశంలో ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం చొరవతో సౌదీ అరేబియా ఎడారిలో యజమాని చెర నుంచి నిర్మల్‌ జిల్లా వాసికి విముక్తి కలిగింది.

సౌదీ నుంచి హైదరాబాద్ చేరుకున్న గల్ఫ్ బాధితుడు నాందేవ్ రాథోడ్‌కు ఆయన కుటుంబ సభ్యులు, గల్ఫ్‌ బాధితుల సంఘం నేత మంద భీమ్‌ రెడ్డి స్వాగతం పలికారు. హౌస్ కీపింగ్ ఉద్యోగం పేరుతో సౌదీకి తీసుకెళ్లి, ఎడారిలో ఏజెంట్‌ వదిలేశారంటూ బాధితుడు ఆందోళన వ్యక్తం చేశాడు. తనను రక్షించి హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సెల్ఫీ వీడియో ద్వారా ముఖ్యమంత్రిని వేడుకున్న నేపథ్యంలో గల్ఫ్ బాధితుల సంఘం నేతలు సర్కారు చొరవతో శంషాబాద్‌ తీసుకువచ్చారు. గల్ఫ్‌లో మానవ అక్రమ రవాణా మాఫియాగా మారిందంటూ గల్ఫ్‌ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మంద భీంరెడ్డి ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details