ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

నెల్లూరు జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ - కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు రాజీనామా, టీడీపీలో చేరిక - ycp leader joining to tdp party - YCP LEADER JOINING TO TDP PARTY

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 19, 2024, 4:44 PM IST

Nellore YCP Leaders JOin In TDP Party : నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీలో క్రీయాశీలకంగా ఉన్న వైసీపీ ట్రేడ్ యూనియన్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు ముత్యంగౌడ్ తెలుగుదేశంలో చేరారు. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ముత్యంగౌడ్ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆ పార్టీని వీడుతున్నానని తెలిపారు. కార్మికుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలతో మనస్థాపానికి గురిఅయ్యానని వెల్లడించారు.

గత ప్రభుత్వంలో కల్లుగీత కార్మికులు చనిపోతే రూ. 5లక్షలు ఎక్స్​గ్రేషియా ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దాన్ని రూ.10 లక్షలకు చేస్తారని జగన్ హామీ ఇచ్చారు. ఐదేళ్లు గడిచిన ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. ఇప్పటివరకు నెల్లూరు జిల్లాలోనే 30 మంది కార్మికులు చనిపోయారు. ఏ ఒక్కరికి కూడా పరిహారం చెల్లించింది లేదు. ఈ సమస్యలన్నింటిపై ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లిన ఎటువంటి స్పందన లేదని తెలిపారు. కల్లుగీత కార్మికుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నందున కార్మికులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముత్యం గౌడ్ వెల్లడించారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే టీడీపీలోకి చేరినవారికి పార్టీ అధికారంలోకి రాగానే వారి డిమాండ్లను ఖచ్చితంగా పరిశీలిస్తామని కోటంరెడ్డి హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details