ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

తిరుపతి లడ్డు అపచారం - రామతీర్థం దేవస్థానంలో ప్రాయశ్చిత్త హోమం - Tirupati laddu adulteration - TIRUPATI LADDU ADULTERATION

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 28, 2024, 4:54 PM IST

Special Homam in Ramatirtha Temple : విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో పవిత్ర పుణ్యక్షేత్రం అయినటువంటి రామతీర్థం దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ అపచారమునకు ప్రాయశ్చిత్తముగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా రామతీర్థం ఆలయ సమీపంలో ఉన్న మహా శాంతి హోమంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు హాజరయ్యారు. ఏపీ మార్క్​ఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగార్రాజు, నెల్లిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే లోకం నాగమాధవి సైతం  హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు. ముందుగా రాములవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి అనంతరం వెంకటేశ్వర స్వామి దైవ సన్నిధి వద్ద హోమం చేపట్టారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వరస్వామి భక్తులు అందరూ దీనికి సంపూర్ణంగా వారి మద్దతు తెలియజేస్తున్నారని ఆయన వెల్లడించారు. ప్రాయశ్చిత దీక్ష చేసిన  అనంతరం హోమం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.  

ABOUT THE AUTHOR

...view details