ఓటమి భయంతోనే టీడీపీ కార్యకర్తలపై దాడి- అమర్నాథరెడ్డి హత్యపై లోకేశ్ తీవ్ర ఆగ్రహం - Lokesh on TDP Activist Murder - LOKESH ON TDP ACTIVIST MURDER
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 25, 2024, 8:37 PM IST
Nara Lokesh Condemned TDP Activist Murder in Sri Sathyasai District: ఐదేళ్లుగా జగన్ సాగించిన ఆటవిక పాలన, ఎన్నికల కోడ్ వచ్చాక కూడా కొనసాగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా ట్వీట్ (Nara Lokesh tweet) చేశారు. వైసీపీ అధినేత జగన్ గొడ్డలితో తెగబడితే వైసీపీ కార్యకర్తలు వేటకొడవళ్లతో జనాల్ని వేటాడుతున్నారని ఆరోపించారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. శ్రీసత్యసాయి జిల్లా నల్లమాడ మండలం కుటాలపల్లిలో తెలుగుదేశం కార్యకర్త అమర్నాథరెడ్డి హత్యని లోకేశ్ తీవ్రంగా ఖండించారు. ఇది ముమ్మాటికీ వైసీపీ సైకోల పనేనని ఆరోపించారు. ఓటమి భయంతోనే తెలుగుదేశం కార్యకర్తల్ని అంతమొందిస్తున్నారని దుయ్యబట్టారు. జగన్‌ని నమ్ముకుని హత్యలకు పాల్పడే వారిని ఎవ్వరూ కాపాడలేరని లోకేశ్ హెచ్చరించారు. వైసీపీ నాయకుల అరాచకాలకు టీడీపీ కార్యకర్తలు ఎవరు భయపడరని రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం జెండా ఎగరవేస్తామని జగన్ అనుచరులు గుర్తుపెట్టుకొని నడుచుకోవాలని నారా లోకేశ్ హెచ్చరించారు.