ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

నేటి నుంచి 'నిజం గెలవాలి' యాత్ర - 4 రోజులపాటు కొనసాగనున్న తొమ్మిదో విడత - Bhuvaneswari Nijam Gelavali Yatra

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 27, 2024, 9:26 AM IST

Nara Bhuvaneswari Nijam Gelavali Yatra: తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి 9వ విడత యాత్ర నేటి నుంచి అరకు, అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గాల్లో నిర్వహించనున్నారు. నేడు విశాఖ విమానాశ్రయానికి చేరుకోనున్న భువనేశ్వరి అరకు, పాడేరు, సాలూరు, చోడవరం, యలమంచిలి, అనకాపల్లి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. 

కాగా చంద్రబాబు అరెస్ట్ సమయంలో మనస్థాపానికి గురై మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' పేరుతో యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఈ యాత్ర ద్వారా మరణించిన టీడీపీ కార్యకర్తలు, అభిమానుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబీకులకు ఆర్థిక సాయం చేయడంతో పాటు, వారికి ధైర్యం నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా 4 రోజుల పర్యటనలో 15 మంది కార్యకర్తల కుటుంబాలను కలవనున్నారు. సాలూరు పట్టణంలోని ఎన్టీఆర్ హెల్త్ క్లీనిక్‌ను ఆమె ప్రారంభించనున్నారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా నేడు సాలూరులో ఎన్టీఆర్ హెల్త్ క్లినిక్ ప్రారంభించనున్నారు. పాడేరులో గిరిజన మహిళలతో ముఖాముఖిలో కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొననున్నారు. 

ABOUT THE AUTHOR

...view details