LIVE: కుప్పంలో ముస్లిం సోదరీమణులతో నారా భువనేశ్వరి ముఖామఖి ప్రత్యక్ష ప్రసారం - Nara Bhuvaneshwari With Minorities - NARA BHUVANESHWARI WITH MINORITIES
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 20, 2024, 11:29 AM IST
|Updated : Apr 20, 2024, 11:52 AM IST
Nara Bhuvaneshwari With Minorities in Kuppam : కుప్పంలో ఘనంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు. నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తల సంబరాలు చేసుకున్నారు. భువనేశ్వరి క్యాంపు సైట్ కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాలలో ఈ వేడుకలు జరిగాయి అనంతరం కుప్పం నియోజకవర్గ ముస్లిం సోదరీమణులతో నారా భువనేశ్వరి ముఖాముఖిలో పాల్గొన్నారు. వైఎస్ జగన్కు అన్ని అస్త్రాలు అయిపోయి కుల, మత రాజకీయాలపై పడ్డాడని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ముస్లింలకు మేలు చేసింది చేసేది తెలుగుదేశమేనని స్పష్టం చేశారు. పేద ముస్లింలకు ఇచ్చే రంజాన్ తోఫా రద్దు చేసిన జగన్ నేడు మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి, పలువురు ముస్లిం సంఘాలు చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. కుప్పం నియోజకవర్గ ముస్లిం సోదరీమణులతో నారా భువనేశ్వరి ముఖామఖి మీకోసం ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Apr 20, 2024, 11:52 AM IST