ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

చంద్రబాబు ప్రమాణస్వీకారముకు నందమూరి కుటుంబ సభ్యులు - Nandamuri Family Chandrababu Oath - NANDAMURI FAMILY CHANDRABABU OATH

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 12, 2024, 10:39 AM IST

Nandamuri Family Visit Chandrababu Oath Ceremony as AP CM : రాష్ట్రంలో ప్రజల కోరుకున్న ప్రభుత్వం రానుందని ఎన్టీఆర్ తనయుడు రామకృష్ణ అభిప్రాయపడ్డారు. ప్రజలకు గత ఐదేళ్లుగా ఎన్నో కష్టనష్టాలు చూసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు పాలనలో ఏపీ సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. నందమూరి కుటుంబసభ్యులతో కలిసి విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులో ప్రమాణా స్వీకర వేదికైన కేసరపల్లికి బయలుదేరారు. రామకృష్ణతో పాటు గారపాటి శ్రీనివాస్, బాలకృష్ణ సతీమణి వసుంధర తదితరులు ఉన్నారు. నందమూరి కుటుంబసభ్యులను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. 

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఏపీని దేశంలోనే మొదటి స్థానానికి తీసుకువస్తారని రామకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీని ప్రగతి బాటలో నడిపించేందుకు చంద్రబాబు నిరంతరం కృషి చేస్తారని పేర్కొన్నారు. జెండాలు వేరు అయిన అజెండా ఒకటిగా కూటమి అభ్యర్థులు ముందుకు వెళ్లారని పేర్కొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులను అఖండ మెజారీటీతో గెలిచినందుకు రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details