ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రి రిలీజ్ సిద్ధమైన లెజెండ్ - ఈసారి విజయం టీడీపీదే అన్న బాలకృష్ణ - Legend Movie Re Release Event - LEGEND MOVIE RE RELEASE EVENT

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 29, 2024, 8:07 PM IST

Nandamuri Balakrishna key Comments: పసుపు రంగు తెలుగు ప్రజల ఆత్మాభిమానానికి, అభివృద్ధికి సూచికని నందమూరి బాలకృష్ణ అన్నారు. రాబోయే ఎన్నికల ప్రచారంలో తన రాజకీయం ఏంటో ప్రజలు చూస్తారని బాలకృష్ణ పేర్కొన్నారు. 2014 ఎన్నికల సమయంలో లెజెండ్ సినిమా ద్వారా తానేంటో చూపించానని తెలిపారు. మరో మారు ఆ సినిమాను రి రిలీజ్ చేస్తున్నామని తెలిపారు.

 బోయపాటి శీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన లెజెండ్ చిత్రం పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రేపు ఆ చిత్రాన్ని మరోసారి విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన వేడుకలకు హాజరైన బాలకృష్ణ నటుడిగా, హిందూపూర్ ఎమ్మెల్యేగా, బసవతారం ఆస్పత్రి ఛైర్మన్ గా ప్రజలు, ప్రేక్షకులు అభిమానులు తనకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నారని గుర్తుచేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే ఎన్నికల్లో లెజండ్ చిత్రం ప్రభావం చూపుతుందని, తప్పకుండా విజయం మనదేనని బాలకృష్ణ పేర్కొన్నారు. తాను రాష్ట్రంలో జరిగేది తన సినిమాలో ముందే చూపించానని తెలిపారు. గతంలో తాము చూపించింది ప్రస్తుతం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన లెజెండ్ డైరెక్ట్​ర్ బోయపాటి శ్రీని రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ మంచి కోసం ఓటు వేయాలని సూచించారు. 

ABOUT THE AUTHOR

...view details