ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసింది: బాలకృష్ణ - టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 28, 2024, 7:21 PM IST

Nandamuri Balakrishna Comments on YCP Government: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం - జనసేన కూటమి అధికారంలోకి రావడం తథ్యమని, ఇందుకు ప్రజలంతా సిద్ధమని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం కార్యకర్తలే అని ఆయన పేర్కొన్నారు.  టీడీపీ అధినేత చంద్రబాబు బడుగు బలహీన వర్గాలను అధికార పీఠం పైకి ఎక్కించారని బాలకృష్ణ అన్నారు. వైసీపీ చేస్తున్న నాటకాలను ప్రజలు గ్రహించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అన్ని వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని బాలకృష్ణ మండిపడ్డారు. 

జగన్​ సర్కార్​ హయాంలో రైతుల ఉనికే లేకుండా పోయిందని బాలకృష్ణ మండిపడ్డారు. రాష్ట్రాన్ని కులాలు, మతాల పేరుతో వైఎస్సార్సీపీ చిచ్చుపెడుతుందని బాలకృష్ణ విమర్శించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీ-జనసేన కూటమిని ప్రజలు ఆశీర్వదించాలని బాలకృష్ణ కోరారు. ప్రతి ఒక్కరూ ఓటు అనే ఆయుధాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని బాలయ్య ఆశాభావం వ్యక్తం చేశారు.  

ABOUT THE AUTHOR

...view details