ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి - అనపర్తి నుంచి పోటీ - Nallamilli Anaparthi BJP candidate - NALLAMILLI ANAPARTHI BJP CANDIDATE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 24, 2024, 10:18 AM IST

Nallamilli Ramakrishna as Anaparthi BJP Candidate : తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ప్రకటించారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ఎన్నికల ఇంఛార్జ్​లు అరుణ్​ సింగ్​, సిద్ధార్ధనాథ్​​ సింగ్​, ఇతర బీజేపీ నేతల సమక్షంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరారు. పార్టీ కండువా వేసి నేతలు నల్లమిల్లికి సాదర స్వాగతం పలికారు. అనంతరం రామకృష్ణారెడ్డి సభ్యత్వాన్ని తీసుకున్నారు. అనపర్తి నియోజకవర్గం నుంచి తొలుత శివ రామకృష్ణంరాజు ప్రకటించిన స్థానిక పరిస్థితులు, విజయావకాశాలు బేరాజు వేసుకుని టీడీపీ నాయకుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బీజేపీలో చేర్చుకుని తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు.  శివ రామకృష్ణంరాజు నిజమైన కార్యకర్త అని పురేందేశ్వరి తెలిపారు. వారి గౌరవాన్ని పార్టీ దృష్టిలో పెట్టుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్య నారాయణ రాజు, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, టూర్స్ ఇంఛార్జి కిలారు దిలీప్, రాజమహేంద్రవరం జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details