Ministers Committee On Free Bus scheme in AP : ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకంపై అధ్యయనానికి మంత్రుల కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఈ పథకాన్ని అధ్యయనం చేసి సిఫార్సు చేయాలని మంత్రుల కమిటీకి సూచించింది. రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి నేతృత్వంలో మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, హోంశాఖ మంత్రి అనిత సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ కన్వీనర్‌గా రవాణాశాఖ ముఖ్యకార్యదర్శిని నియమిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం ఈ పథకంపై నిర్ణయం తీసుకునేందుకు వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని మంత్రుల కమిటీకి సూచించింది.
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ద్వారా ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. పార్వతీపురం ఆర్టీసీ డిపో వద్ద 9 కొత్త బస్సులను ఆయన ప్రారంభించారు. అనంతరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే విజయ్ చంద్రతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని ఎస్వీడీ కళాశాల వద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు భూమి పూజ చేశారు. సీతానగరం మండల కేంద్రంలో ఐదు లక్షల రూపాయలతో బస్ షెల్టర్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. నర్సిపురం గ్రామ సమీపంలో డ్రైవింగ్ శిక్షణ ప్రాంతాన్ని ప్రారంభించారు. పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ డిపోను అభివృద్ధి చేసేందుకు మంత్రి హామీ ఇచ్చారు.
ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ - నైటౌట్ అలవెన్సులు మంజూరుకు జీవో
ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కష్టపడుతున్నారని తెలిపారు. గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేసిందని ఆరోపించారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమౌతుందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేస్తూ, ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధితో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు.
ఏపీలో ఎలక్ట్రిక్ బస్సులకు హాయ్ హాయ్ - ఇక పాత బస్సులకు బై బై
వృద్ధులకు గుడ్‌న్యూస్ - ఈ కార్డులుంటే ఆర్టీసీ బస్సుల్లో 25 శాతం రాయితీ