ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

డ్రామాలు వైసీపీ నైజం - రాయి దాడిలో ఎవరిని బలి చేయబోతున్నారు?: నక్కా ఆనంద్ బాబు - Nakka Anand Babu on CM Jagan - NAKKA ANAND BABU ON CM JAGAN

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 14, 2024, 1:17 PM IST

Nakka Anand Babu Allegations on CM Jagan: గత ఎన్నికల వేళ కోడికత్తి దాడి అని డ్రామాలు ఆడిన సీఎం జగన్ ఇప్పుడు మళ్లీ రాళ్ల దాడి అంటూ కొత్త నాటకానికి తెర లేపారని టీడీపీ సీనియర్ నేత నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు. విజయవాడలో జరిగిన రాళ్ల దాడి ఎన్నికల లబ్ధి కోసం జగన్ తనకు తాను చేయించుకున్నదేనని ఆనంద్ బాబు ఆరోపించారు. ఎన్నికల ముందు ఇలాంటి డ్రామాలు ఆడటం వైసీపీ నైజమన్న ఆనందబాబు, గత ఎన్నికల వేళ కోడికత్తి దాడి అంటూ దళిత యువకుడిని ఐదేళ్లు జైల్లో మగ్గేలా చేశారని ధ్వజమెత్తారు. ఈ రాళ్ల దాడిలో ఎవరిని బలి చేయబోతున్నారని ప్రశ్నించారు. 

రాష్ట్రానికి భద్రత కల్పించాల్సిన సీఎంకే భద్రత లేదంటే అది జగన్ చేతకానితనమన్నారు. ఇది ముమ్మాటికీ తాడేపల్లి ప్యాలెస్​లోని ఐ ప్యాక్ ఆధ్వర్వంలో పథకం ప్రకారం జరిగిన దాడిగా అభివర్ణించారు. గత ఎన్నికల సమయంలో బాబాయ్ చంపి, చంద్రబాబు మీద దుష్ప్రచారం చేసి లబ్ధి పొందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకా రక్తపు పునాదుల మీద జగన్ ప్రభుత్వం ఏర్పడిందని సొంత చెల్లెలే చెబుతున్నారని నక్కా ఆనంద్ బాబు పేర్కొన్నారు. ఎన్నికల కోసం వైసీపీ ఆడుతున్న నాటకాలను ప్రజలంతా గమనిస్తున్నారన్నారు.

ABOUT THE AUTHOR

...view details