సమర్ధుడైన వ్యక్తికి మంచి బాధ్యతలు దక్కాయి: నాగబాబు - Nagababu on Pawan Taking Charge - NAGABABU ON PAWAN TAKING CHARGE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 19, 2024, 7:45 PM IST
Nagababu Reacts on Pawan Kalyan Taking Charge as Minister: పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కల్యాణ్ బాధ్యతలు స్వీకరించడంపై ఆయన సోదరుడు కొణిదెల నాగబాబు స్పందించారు. సమర్ధుడైన వ్యక్తికి మంచి బాధ్యతలు దక్కాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కొన్ని వ్యవస్థలకు మరమ్మత్తులు చేయాల్సి ఉందని వాటిని పవన్ కల్యాణ్ కచ్చితంగా చేస్తారని నాగబాబు చెప్పారు. వ్యవస్థల గురించి తెలిసిన వ్యక్తి అని శాఖల గురించి మంచి అవగాహన కలిగి ఉన్నారని అన్నారు. సంబంధిత శాఖల అధికారులతో పవన్ సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారని త్వరలోనే ప్రజలు మంచి మార్పు చూస్తారని ఆనందం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్‌ను ఆ స్థానంలో చూస్తుంటే సోదరుడిగా నాకు చాలా సంతోషంగా కొణిదెల నాగబాబు ఉందని అన్నారు. కాగా ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడ క్యాంపు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఛాంబర్‌లో పూజలు నిర్వహించిన అనంతరం దస్త్రాలపై సంతకాలు చేశారు.