ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

గ్లాసు తేనీటి విందునిస్తుంది, ఫ్యాను రెక్కలు విరిగితే ఎందుకూ పనికి రాదు : నాగబాబు - Nagababu Tweet

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 19, 2024, 9:21 PM IST

Nagababu Comments On CM Jagan : రాప్తాడు సిద్ధం సభలో సీఎం జగన్​ మోహన్​ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాజు గ్లాసు గుర్తుపై రాప్తాడు సిద్ధం సభలో సీఎం జగన్​ వ్యాఖ్యలకు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు సామాజిక మాధ్యమాల ద్వారా కౌంటర్ ఇచ్చారు.

"గాజు గ్లాసు సింకులో ఉన్నా తెల్లారితే మళ్లీ తేనీటి విందునిస్తుంది. ' ఫ్యాన్ '​ రెక్కలు విరిగితే విసనకర్ర ఇచ్చినంత గాలి కూడ ఇవ్వదు. ముఖ్యమంత్రి జగన్​ మోహన్​ రెడ్డి బహిరంగ సభల్లో ప్రాసలు, పంచులు మీద పెట్టిన శ్రద్ధలో సగమైనా ప్రజాపరిపాలన మీద పెట్టుంటే బాగుండేది" అని ఎక్స్​ వేదికగా పేర్కొన్నారు.

అదే విధంగా రాప్తాడు సిద్ధం సభలో జగన్​ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం స్పందించారు. బహిరంగ చర్చలకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఎవరి పాలనలో అభివృద్ధి జరిగిందో, ఎవరి పాలనలో విధ్వంసం జరిగిందో తేల్చుకుందామని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details