ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

అనంత నగర పాలక కార్యాలయంలో సినిమా చిత్రీకరణ - స్థానికుల ఆగ్రహం - Municipal Office Movie Shooting - MUNICIPAL OFFICE MOVIE SHOOTING

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 28, 2024, 5:31 PM IST

Municipal Office Movie Shooting in Anantapur District : అనంతపురం నగర పాలక సంస్థ కార్యాలయ ఆవరణలో సినిమా చిత్రీకరణపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఎన్నికల సమయంలో ప్రభుత్వ కార్యాలయంలో సినిమా తీయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎమ్మార్వో కార్యాలయానికి సంబంధించిన దస్త్రాలపై చిత్రీకరణ సాగుతోంది. ఏ సినిమా అన్నది గోప్యంగా ఉంచారు. తమిళ సినిమాకు సంబంధించిన అనువాద సినిమా అని చెబుతున్నారు. ఎమ్మార్వో కార్యాలయానికి సంబంధించిన దస్త్రాలపై చిత్రీకరణ సాగుతోంది. కార్యాలయంలో కూడా కొన్ని అంశాలను చిత్రీకరించారు.

ఈ సినిమా వాలంటరీ వ్యవస్థను ఉద్దేశించి చిత్రీకరణ చేపడుతున్నట్లు నటిస్తున్న నటులు చర్చించుకుంటున్నారు. ఎన్నికల నేపథ్యంలో కార్యాలయంలో సినిమా షూటింగ్ ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ఆదేశాలు, ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి సన్నివేశాలు చేయకూడదని పలువురు చెబుతున్నారు. అయితే ఎన్నికల కోడ్​ అమల్లో ఉంటే సినిమా చిత్రీకరణకు అధికారులు ఎలా అనుమతులు ఇస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై నగర పాలక అధికారులు సమాధానం చెప్పాలని టీడీపీ నాయకులు డిమాండ్​ చేశారు. 

ABOUT THE AUTHOR

...view details