ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

దళితురాలిననే చిన్నచూపు చూస్తున్నారు: ఎంపీపీ స్వప్న ఆవేదన - ప్రోటోకాల్ గౌరవం లేదని ఎంపీపీ ఆవేదన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 26, 2024, 9:43 PM IST

Mpp Protocal Complaint in Spandana Program At Guntur: ప్రోటోకాల్ ప్రకారం తనకు గౌరవం దక్కడం లేదని గుంటూరు జిల్లా మేడికొండూరు మండల ఎంపీపీ మన్నవ స్వప్న ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీపీగా బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాల మూడు నెలలు అవుతుంది. మండలం పరిధిలోని గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనుల గురించి కనీసం తనకు ఆహ్వానం కూడా పంపటం లేదని వాపోయారు. వైసీపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. తన కంటే కూడా పార్టీకి చెందిన వారికే ఆహ్వానాలు వెళ్తున్నాయని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో వేసే శిలాఫలకాలపై కూడా తన పేరు లేకుండా అధికారులు, పార్టీకి చెందిన వారు వ్యవహరిస్తున్నారని ఆమె తెలిపారు. ఇదే విషయంపై గుంటూరు స్పందన కార్యక్రమంలో ఆమె ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. అధికార పార్టీకి చెందిన ఎంపీపీని అయినా తనది తక్కువ కులం కావటంతోనే పక్కన పెడుతున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

ఎంపీపీగా గెలిపించినప్పటి నుంచి 14గ్రామాల్లో జరుగుతున్న కార్యక్రమాలకు ఆహ్వానించటం లేదు. దళిత మహిళననే చిన్న చూపుతో ఎంపీపీకి ఇవ్వాల్సిన ప్రొటోకాల్, భద్రత పాటించట్లేదు. ప్రతి గ్రామంలో ఉన్న స్థానిక నేతలు, అధికారులు నన్ను ఎంపీపీగా అసలు పట్టించుకోవట్లేదు. మా నియోజకవర్గంలో ఉన్నవాళ్లకి రాబోయే రోజుల్లో అడ్డుగా ఉంటానని ప్రొటోకాల్ పాటించకుండా చేస్తున్నారు.- మన్నవ స్వప్న, మేడికొండూరు ఎంపీపీ.

ABOUT THE AUTHOR

...view details