తల్లిని చూసి కన్నీరు పెట్టుకుని, హత్తుకున్న ఎమ్మెల్సీ కవిత - వీడియో వైరల్ - mlc kavitha reach home video viral - MLC KAVITHA REACH HOME VIDEO VIRAL
Published : Aug 28, 2024, 8:37 PM IST
MLC Kavitha Cried on Seeing his Mother : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాదాపు 5 నెలలు తర్వాత తిహాడ్ జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చారు. నేడు ఆమె దిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. భారీ కాన్వాయ్ మధ్య శంషాబాద్ విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్ తన నివాసానికి చేరుకున్నారు. అప్పటికే కవిత నివాసం వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులు సందడి చేశారు. డ్యాన్సులు, డప్పు చప్పుళ్లతో కోలాహలం చేశారు. ఆమె ఇంటికి రాగానే బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు.
కవిత కారు దిగి ఇంట్లోకి వెళుతున్నప్పుడు శ్రేణులు జై కవితక్క అంటూ నినాదాలు చేశారు. అనంతరం కవితకు దిష్ఠి తీశారు. అప్పటికే ఇంట్లో కవిత తల్లి శోభ, కేటీఆర్ సతీమణి శైలిమ ఉన్నారు. కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని కవిత ఆలింగనం చేసుకున్నారు. తల్లి శోభకు పాదాభివందనం, ఆలింగనం చేసుకొని కన్నీటిపర్యంతమయ్యారు. అనంతరం సోదరుడు కేటీఆర్కు కవిత రాఖీ కట్టారు.