ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: హైదరాబాద్‌ చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత - ప్రత్యక్షప్రసారం - MLC Kavitha Reached Hyderabad - MLC KAVITHA REACHED HYDERABAD

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 28, 2024, 5:43 PM IST

Updated : Aug 28, 2024, 6:03 PM IST

MLC Kavitha Reached Hyderabad LIVE : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో బీఆర్ఎస్‌ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. కవిత విడుదలతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. టపాసులు పేల్చి సంబురాలు చేసుకున్నారు. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన కవిత 164 రోజుల తర్వాత జైలు నుంచి విడుదల అయ్యారు. ఈడీ, సీబీఐ కేసుల్లో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తీహాడ్ జైలు నుంచి బయటకు వచ్చారు. సర్వోన్నత న్యాయస్థానం నిర్దేశించిన పూచీకత్తును కవిత భర్త అనిల్ కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర రౌస్ అవెన్యూ కోర్టులో సమర్పించారు. వాటిని అంగీకరించిన రౌస్ అవెన్యూ కోర్టు కవిత విడుదలకు అనుమతిస్తూ తీహాడ్ జైలుకు వారెంట్ జారీ చేశారు. విడుదల ప్రక్రియ అనంతరం రాత్రి 9 గంటల తర్వాత కవిత తీహాడ్ జైలు నుంచి బయటకు వచ్చారు. అప్పటికే అక్కడికి కవిత భర్త, కుమారుడు, సోదరుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, బీఆర్ఎస్ ఎంపీలు, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున చేరుకున్నాయి. జైలు నుంచి బయటికి వచ్చిన వెంటనే కుమారుడు, భర్త సహా సోదరుడు కేటీఆర్‌ ఆలింగనం చేసుకొని కవిత ఉద్వేగానికి లోనయ్యారు.
Last Updated : Aug 28, 2024, 6:03 PM IST

ABOUT THE AUTHOR

...view details