రూ.15లక్షలు వచ్చిన వారు బీజేపీకి, రానివారు కాంగ్రెస్‌కు ఓటేయండి: జీవన్ రెడ్డి - MLC Jeevan Reddy Comments on BJP - MLC JEEVAN REDDY COMMENTS ON BJP
Published : Mar 21, 2024, 7:48 PM IST
MLC Jeevan Reddy Fires on BJP : ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలను ఇస్తామని నమ్మబలికి పదేళ్లలో ఒక్క ఉద్యోగం ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే బీజేపీ నాయకులను నిలదీయాలని ఓటర్లకు చెప్పారు. జగిత్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్‌లో భారీగా చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని ఇచ్చిన హామీని మోదీ మరిచారని మండిపడ్డారు. రూ.15లక్షలు వచ్చిన వాళ్లు బీజేపీకి, రానివాళ్లు కాంగ్రెస్ ఓటు వేయాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పింఛను రాదన్నారని. కానీ ప్రభుత్వం పింఛన్లు ఇస్తుందని చెప్పారు. వ్యవసాయం చేసే ప్రతి రైతుకు రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం చెట్లకు, గుట్టలకు రైతు బంధు ఇవ్వదని తెలిపారు. రైతుల విషయంలో బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు.