తెలంగాణ

telangana

ETV Bharat / videos

రాముడిని కాకుండా మోదీని పూజించాలనేది బీజేపీ నేతల సిద్ధాంతం : జీవన్ రెడ్డి - Jeevan Reddyabout BJP Yatra

By ETV Bharat Telangana Team

Published : Feb 27, 2024, 3:59 PM IST

MLC Jeevan Reddy About Modi : బీజేపీ విజయ సంకల్ప యాత్ర పేరుతో కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. రాముడికి, మోదీకి ఏం సంబంధముందని ప్రశ్నించారు. గుడిలో రాముడిని కాకుండా మోదీని పూజించాలనేది బీజేపీ నేతల సిద్ధాంతమని ఆరోపించారు. ఇవాళ గాంధీ భవన్​లో ప్రభుత్వ విప్​ ఆది శ్రీనివాస్​తో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ నేతలు దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారని ఆక్షేపించారు.

MLC Jeevan Reddy Comments on BJP : వికసిత్ భారత్‌ పెట్టుబడిదారుల కోసమేనని, అంబానీ, అదానీ కోసం వికసిత్ భారత్‌ తీసుకువచ్చారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. రైతులకు రుణమాఫీ చేస్తే సోమరిపోతులు అవుతారంటున్నారని, అంబానీ, అదానీకి లోన్​లు రుణమాఫీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. బండి సంజయ్‌ రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మాతృమూర్తిపై అనుచితంగా మాట్లాడిన సంజయ్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details