ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

శృంగవరపుకోటలో వైఎస్సార్సీపీని వీడనున్న ఎమ్మెల్సీ - ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య ముదిరిన విభేదాలే కారణమా?

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 4, 2024, 11:24 AM IST

MLC Indukuri Raghuraj Leave YCP in Vizianagaram District : విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో వైసీపీకి పెద్ద ఎదురు దెబ్బ తగలింది. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు వర్గం పార్టీని వీడేందుకు సిద్ధమైంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య విభేదాలు ఇందుకు కారణమని తెలుస్తోంది. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు విజయం కోసం చాలా కష్టపడి పనిచేశామని, అయితే తమను పట్టించుకోవట్లేదంటూ ఎమ్మెల్సీ చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారు. పార్టీ పదవులు, ప్రభుత్వ నియామక పదవుల్లో కనీస ప్రాధాన్య లేదంటూ రెండేళ్లక్రితమే అసమ్మతి గళం వినిపించారు. ఈ మధ్య కాలంలో వారిందరి మధ్య అధిపత్య పోరు మరింత తీవ్రమైంది. 

ఎమ్మెల్యే కడుబండికి ఈ సారి టికెట్టు ఇవ్వొద్దని, ఇస్తే ఓడిస్తామని తీర్మానాలు చేసినా అధిష్ఠానం పట్టించుకోలేదని తెలుస్తోంది. ఎమ్మెల్యే టికెట్టు కడుబండికే అన్న సంకేతాలు ఇచ్చింది. ఇరు వర్గాల మధ్య విభేదాలకు తెరదించాలని పార్టీ పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గౌరవం లేని చోట కన్నా గుర్తింపు ఇచ్చే పార్టీలోకి వెళ్లడమే రాజకీయంగా మేలని రఘురాజు వర్గం భావించినట్లు తెలుస్తోంది. మంగళగిరిలో లోకేశ్ సమక్షంలో ఇవాళ తెలుగుదేశం తీర్థం పుచ్చుకోనున్నారు. 

ABOUT THE AUTHOR

...view details