ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున వైఎస్సార్సీపీ తొత్తుగా పని చేస్తున్నారు: ఎమ్మెల్యే వెలగపూడి - Visakha Collector Mallikharjuna

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 11, 2024, 5:55 PM IST

MLA Velagapudi on Visakha Collector: విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున వైఎస్సార్సీపీ తొత్తుగా పని చేస్తున్నారని తూర్పు నియోజకవర్గం శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు ఆరోపించారు. కలెక్టర్ మల్లికార్జునను ఎన్నికల విధుల నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, ఎన్నికల కమిషనర్ ​లకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దసపల్లా, హయగ్రీవ భూములు అధికార పార్టీ నేతల పరమయ్యాయని, అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వీఎమ్​ఆర్​డీఏ(Visakhapatnam Metropolitan Region Development Authority) మాస్టర్ ప్లాన్ మార్పు జరిగిందని అన్నారు. ఒకే బూత్​లో డూప్లికేట్ ఎపిక్ నంబర్లు ఎంట్రీ చేశారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని వాపోయారు.

"విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున వైఎస్సార్సీపీ తొత్తుగా పని చేస్తున్నారు. ఆ కారణంగా కలెక్టర్ మల్లికార్జునను ఎన్నికల విధుల నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, ఎన్నికల కమిషనర్ ​కు ఫిర్యాదు చేశాం. ఓటరు జాబితాలో తప్పుల గురించి కలెక్టర్‌ దృష్టికి తెచ్చినా ఫలితం శూన్యం. ఒకే ఓటరుకార్డు నంబర్‌ మీద వేర్వేరు పోలింగ్‌ బూత్‌లలో ఓట్లు ఉన్నాయి." - వెలగపూడి రామకృష్ణ బాబు, విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే

ABOUT THE AUTHOR

...view details