ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఎన్ని క్యాంపులు పెట్టినా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కూటమిదే విజయం- విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీ కృష్ణ - MLA Vamsi On Visakha MLC Election - MLA VAMSI ON VISAKHA MLC ELECTION

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 11, 2024, 10:32 PM IST

MLA Vamsi On Visakha MLC Election: జగన్ ఎన్ని క్యాంపు రాజకీయాలు చేసినా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కూటమిదే విజయం అని  ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. విశాఖ నగర నూతన జనసేన కార్యాలయాన్ని ద్వారకానగర్ సమీపంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, విశాఖ అన్ని విధాలా అభివృద్ధి అవుతుందని, ఐటీ పరంగా విశాఖకు చాలా భవిష్యత్ ఉందని అన్నారు. ప్రకృతి పరంగా పర్యావరణ పరంగా కూడా విశాఖ నగరానికి సాటిలేదని పేర్కొన్నారు.

 వైఎస్సార్సీపీపై ప్రజా వ్యతిరేకత ఉందని, అందుకే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక లో ఖచ్చితంగా ఆ పార్టీకి భంగపాటు ఖాయమన్నారు. వైఎస్సార్సీపీ పట్ల ప్రజలు భారీ వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సి ఉప ఎన్నిక కోసం ఎక్కడ శిబిరాలు పెట్టుకున్నా ఏమీ జరగదని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ అన్నారు. కచ్చితంగా కూటమి అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details