ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

యాదృచ్ఛికంగా జరిగిన ఘటనపై దుమారం బాధాకరం- ఆరోపణల్ని నిరూపించాలని వైఎస్సార్సీపీ నేతలకు పత్తిపాటి సవాల్​ - MLA Prathipati Pulla Rao Comments - MLA PRATHIPATI PULLA RAO COMMENTS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 29, 2024, 5:03 PM IST

MLA Prathipati Pulla Rao Comments On His Wife Birthday Issue : యాదృచ్ఛికంగా జరిగిన ఘటనపై దుమారం రేగడం బాధాకరమని పల్నాడు జిల్లా చిలకలూరిపేట టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. తన సతీమణి పుట్టినరోజు వేడుకల్లో పోలీసులు పాల్గొనడంపై టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి స్పందించారు. పట్టణంలో ట్రాఫిక్‌ విషయంపై చర్చించడానికి పోలీసుల్ని పిలిచానన్న ఆయన, అదే సమయానికి పార్టీ మండలస్థాయి నాయకులు తన సతీమణి పుట్టినరోజు సందర్భంగా కేకు తెచ్చారన్నారు. అక్కడే కేకు కట్‌ చేశారని,  పోలీసులు సైతం శుభాకాంక్షలు చెప్పారని తెలిపారు. అంతే తప్ప ప్రత్యేకంగా పోలీసులతో వేడుక నిర్వహించలేదన్నారు. అదే సమయంలో అధికారుల బదిలీల విషయంలో తమ కుటుంబ సభ్యులు జోక్యం చేసుకుంటున్నట్లు వైఎస్సార్సీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్ని నిరూపించాలని సవాల్‌ విసిరారు. నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.


ఇటీవల ఎమ్మెల్యే సతీమణి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఆ సమయంలో అక్కడికి కొందరు పోలీసులు వెళ్లారు. అధికారిక హోదా లేకున్నా వేడుకల్లో పాల్గొన్నారంటూ పల్నాడు జిల్లా ఎస్పీ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బర్త్‌డేలో పాల్గొన్న పోలీసులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details