Govt Give Unique Identification Number to Farmers: దేశానికి అన్నం పెట్టేది రైతులే. వీరి సంక్షేమానికి ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. నేల తల్లినే నమ్ముకుని వ్యవసాయం సాగించే అన్నదాతలపై కొన్నిసార్లు వాతావరణం కత్తి దూస్తుంటుంది. అలాంటి వేళ వారిని ఆదుకునేందుకు, పథకాలు, సేవలు సక్రమంగా అందించేందుకు కొన్నిసార్లు క్షేత్రస్థాయిలో అడ్డంకులు ఎదురవుతున్నాయి.
బాధితులెవరో గుర్తించేందుకు అవాంతరాలు తలెత్తుతున్నాయి. వాటన్నింటినీ అధిగమించి సేవలను సమర్థంగా, పారదర్శకంగా అందించాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఆ మేరకు ఫార్మర్ రిజిస్ట్రీ పేరుతో ప్రతీ రైతుకు 14 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇవ్వాలని నిర్ణయించాయి. ఇక నుంచి ఆధార్ తరహాలో ఈ సంఖ్య ప్రామాణికం కానుంది.
ఇవీ ప్రయోజనాలు:
- భూమి ఉన్న రైతులను త్వరగా గుర్తించడంలో ఉపయోగపడుతుంది.
- ప్రభుత్వ రాయితీలు, పంటల బీమా అర్హులకు వర్తింపు.
- భూ ఆధారిత రైతు పథకాలైన పీఎం కిసాన్ చెల్లింపులు, అన్నదాత సుఖీభవ, పంటల బీమా, పంట రుణాలపై వడ్డీ రాయితీపై వ్యవసాయ పరికరాలు తదితర పథకాలను నేరుగా పొందే వీలు.
- ప్రకృతి వైపరీత్యాలతో పంటలు చేతికి అందకుంటే సత్వరమే నష్ట పరిహారం అందించేందుకు చర్యలు.
- నీటి పారుదల, తెగుళ్ల నియంత్రణ, వాతావరణ సూచనలు వంటి సేవలు అందించడం.
గుంటూరు శంకర్ విలాస్ వంతెనకు నిధులు - ఏప్రిల్ నుంచి పనులు
ఇలా వివరాల నమోదు: ముందుగా ప్రత్యేక గుర్తింపు సంఖ్య నమోదుకు రైతు భరోసా కేంద్రాలకు వెళ్లాలి. అక్కడ ఆధార్ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం నకళ్లతో పాటు ఫోన్ నంబరు గ్రామ వ్యవసాయ సహాయకుడికి (Village Agricultural Assistant) ఇవ్వాలి. అప్పుడు వారు రైతు వివరాలను ఆ అధికారి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు.
నమోదు ప్రక్రియ పూర్తయ్యాక రైతు ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. అప్పుడు ఆ ఓటీపీ నంబరు చెప్పడం ద్వారా వీఏఏ లాగిన్‌లో రైతుల వివరాలు 80 నుంచి 100 శాతం కచ్చితంగా ఉంటే సరి. 60 నుంచి 80 శాతం సరైతే వీఆర్వో లాగిన్‌కు వెళ్తుంది. 40 నుంచి 60 శాతమే సరైతే తహసీల్దార్ లాగిన్‌కు వెళ్తుంది. అప్పుడు తహసీల్దార్ తప్పులను సరిచేసి తర్వాత వీఏఏ లాగిన్‌కు పంపుతారు. ఆ తర్వాత సమస్య పరిస్కారం అవుతుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యాక భూమి వివరాల్లో తప్పులు లేకుండా ఉంటే రైతుకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య అందిస్తారు.
అంబరాన్నంటిన అరకులోయ చలి ఉత్సవాలు - మొదట రోజు గ్రాండ్ సక్సెస్