విషజ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : ఎమ్మెల్యే కొలికపూడి - MLA Kolikapudi On Viral Fevers - MLA KOLIKAPUDI ON VIRAL FEVERS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 17, 2024, 7:44 PM IST
MLA Kolikapudi Review Meeting On Viral Fevers : ఎన్టీఆర్ జిల్లా ఏ. కొండూరులో విషజ్వరాలు విజృంభిస్తుండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఇంటి పరిసర ప్రాంతాల్లో శుభ్రతను పాటించాలని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. ఏ. కొండూరులో విషజ్వరాలు పెరిగిపోతుండటంతో కొలికపూడి ఆ ప్రాంతంలో పర్యటించారు. పలు కాలనీల్లో తిరిగి డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. ఎక్కడా చూసిన మురుగు నీరు నిలిచి దోమలు వ్యాప్తి చెందుతుండటంతో వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గత పాలకుల నిర్లక్ష్యంతో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా మారిందన్నారు.
అనంతరం ఏ.కొండూరు పీహెచ్‌సీకి వెళ్లి అక్కడి డీఎంహెచ్‌వోతో విషజ్వరాలపై చర్చించారు. విష జ్వరాల బారిన పడిన రోగులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని సూచించారు. ఎక్కడైతే డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉన్నాయో నోటీసులు అందజేసి సంబంధిత అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసారు. ప్రజలందరూ డెంగ్యూ, మలేరియా, సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన నీటిని వాడొద్దని సూచించారు. అదేవిధంగా రిఫ్రిజిరేటర్‌ను వారానికి ఒకసారి శుభ్రపరచుకోవాలన్నారు.