ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వైఎస్సార్సీపీ నాయకులు సహజ వనరులను దోచుకుంటున్నారు: బాలకృష్ణ - బాలకృష్ణ ఫ్రీమినరల్ వాటర్ ప్లాంట్లు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 8, 2024, 3:24 PM IST

MLA Balakrishna Opened Mineral Water Plant in Satyasai District :  శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కొడికొండ చెక్ పోస్ట్ లేపాక్షి, సిరివరం గ్రామాల్లో 20 లక్షల రూపాయల సొంత నిధులతో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్లను హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. ప్రతిపక్షంలో ఉండి కూడా హిందూపురం నియోజకవర్గంలో సొంత నిధులతో పాటు తెలుగుదేశం పార్టీ ఎంపీల నిధులతో అభివృద్ధి పనులు చేపడుతుంటే వైఎస్సార్సీపీ నాయకులు అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాము చేస్తున్న అభివృద్ధి పనులను చూసి హిందూపురం మున్సిపల్ 20వ వార్డు కౌన్సిలర్ పరశురాం తెలుగుదేశం పార్టీలో చేరారని తెలిపారు. ఈ సందర్భంగా పరశురాంపై పోలీసులు బెదిరింపులకు పాల్పడ్డారని, అతన్ని అన్ని విధాలా ఆదుకుంటామని అభయం ఇచ్చారు. వైఎస్సార్సీపీ నాయకులు సహజ వనరులను తవ్వి దోచుకోవడం, కజ్జాలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దౌర్జన్యాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details