ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావుకు నిరసన సెగ- ప్రశ్నించిన వారిపై విరుచుకుపడిన వైనం - MLA Avanti Frustration

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 15, 2024, 1:44 PM IST

MLA Avanti Srinivasa Rao Frustration on People: మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు(MLA Avanti Srinivasa Rao) తనను ప్రశ్నించే వారిపై విరుచుకుపడ్డారు. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలంలోని గ్రామాల్లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో తునివలసలో జరిగిన సభలో స్థానికులు కాలువ పనుల విషయమై ఎమ్మెల్యేను నిలదీశారు. 

Protest on MLA Avanti Srinivasa Rao: దాన్ని అవంతి జీర్ణించుకోలేక తన అక్కసు వెళ్లగక్కారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ప్రవర్తనపై ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. గతంలో ఆయనిచ్చిన హామీ మేరకే కాలువ ఎందుకు నిర్మించలేదని అడిగితే ఇలా మాట్లాడడం తగదంటూ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు తీరును తప్పుపట్టారు. కాగా గతంలో కూడా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేకు నిరసన సెగలు తగిలాయి. ఎక్కడ చూసినా మురుగునీరు రోడ్లమీదే ఉండటంతో కాలువలు సక్రమంగా లేవనే విషయాన్ని మహిళలు లేవనెత్తారు. 

ABOUT THE AUTHOR

...view details