LIVE : అనుచరులతో కలిసి కౌశిక్ రెడ్డి ఇంటికి అరికెపూడి గాంధీ - కొండాపూర్‌లో తీవ్ర ఉద్రిక్తత - mla Kaushik Reddy House Live - MLA KAUSHIK REDDY HOUSE LIVE
Published : Sep 12, 2024, 12:25 PM IST
|Updated : Sep 12, 2024, 1:20 PM IST
MLA Arekapudi Gandhi went to Kaushik Reddy House Live : ప్రస్తుతం ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి వర్సెస్ అరెకపూడి గాంధీ నడుస్తోంది. సవాళ్లకు ప్రతి సవాళ్లు చేసుకుంటూ ఇద్దరూ క్షణక్షణం ఉత్కంఠను పెంచుతున్నారు. అరెకపూడి గాంధీ ఇంటికి వచ్చి బీఆర్ఎస్ కండువా కప్పుతా అని కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ సవాల్‌ను స్వీకరించిన అరెకపూడి గాంధీ నువ్వు మా ఇంటికి రాకపోతే నేనే మీ ఇంటికి వస్తా అంటూ ప్రతి సవాల్ విసిరారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం చేలరెగింది. అనుచరులతో కలిసి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ కొండాపూర్‌లోని కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. కాన్వాయ్‌తో బయలుదేరి వెళ్లారు. కౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. 'మా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తామంటే ఖాళీగా ఉన్నామా?. కేసీఆర్ అలాంటి వ్యాఖ్యలు చేస్తే స్వాగతించేవాడిని. నాతో పాటు ఉండే ఎమ్మెల్యేలు అడిగినా సమాధానం ఇచ్చేవాడిని. కౌశిక్‌రెడ్డి నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకుంటామా' అంటూ అరెకపూడి గాంధీ తెలిపారు.
Last Updated : Sep 12, 2024, 1:20 PM IST