ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కబ్జాలకు వైఎస్సార్సీపీ కార్యాలయాలే నిదర్శనం - తప్పు చేసిన ఏ ఒక్కర్నీ వదలం: ఎమ్మెల్యే అదితి - MLA Aditi visit YCP Party Office - MLA ADITI VISIT YCP PARTY OFFICE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 27, 2024, 4:44 PM IST

MLA Aditi Vijayalakshmi Gajapathi Raju Visit YCP Party Office : గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ అక్రమాలు, కబ్జాలకు ప్రతి జిల్లాలో ఆ పార్టీ కార్యాలయాల అక్రమ కట్టడాలే నిదర్శనమని ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు విమర్శించారు. విజయనగరంలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయ భవనాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ప్రతి చిన్నదానికీ హడావుడి చేసే వైసీపీ నాయకులు పార్టీ కార్యాలయ భవనాలను మాత్రం అత్యంత గోప్యంగా ఎందుకు చేపట్టారని ప్రశ్నించారు. 

వైఎస్సార్సీపీ హయాంలో చేయని పనులను సైతం చేసినట్లు గొప్పలు చెప్పుకునే నాయకులు పార్టీ కార్యాలయాల విషయంలో మాత్రం ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. ఇవన్నీ చూస్తుంటే పార్టీ కార్యాలయాలన్నీ అక్రమ కట్టడాలేనని స్పష్టం చేశారు. ఈ భవన నిర్మాణ సమయంలో టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టినా సంబంధిత అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. ఈ అక్రమాల్లో రెవెన్యూ అధికారుల పాత్ర ఉందని తెల్చిచెప్పారు. తప్పు చేసిన ఏ ఒక్కర్నీ వదలమని ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు హెచ్చరించారు. 

ABOUT THE AUTHOR

...view details