ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE : సీఐఐ మౌలిక సదుపాయాల సదస్సులో లోకేశ్ - ప్రత్యక్షప్రసారం - Lokesh Live

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 25, 2024, 11:17 AM IST

Updated : Sep 25, 2024, 11:33 AM IST

Lokesh Live : రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోడ్లు, వంతెనలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. మరోవైపు తూర్పు తీరంలో విశాఖ నగరం పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టిన విశాఖ- చెన్నై, విశాఖ- రాయపూర్‌ పారిశ్రామిక కారిడార్లు ఓ రూపు దిద్దుకుంటే, ఈ ప్రాంత బహుముఖ ప్రగతికి దోహద పడనున్నాయి. ఈ తరుణంలో వ్యాపారాల్లో  అవకాశాలు, సవాళ్లు, వినూత్న మౌలిక సదుపాయాలకు నిధులు, ప్రత్యామ్నాయ మార్గాలు తదితరాలపై చర్చించేందుకు భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో ఇవాళ విశాఖలో ‘మౌలిక సదుపాయాల సదస్సు’ నిర్వహించనున్నారు. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఈ సదస్సులో పాల్గొన్నారు. వివిధ సంస్థల ప్రతినిధులు, అధికారులను ఉద్దేశించి లోకేశ్‌ కీలక ప్రసంగం చేయనున్నారు. పలు ఐటీ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయి, విశాఖలో ఐటీ రంగం అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు. 
Last Updated : Sep 25, 2024, 11:33 AM IST

ABOUT THE AUTHOR

...view details