LIVE : జలసౌధలో కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ ప్రెస్‌మీట్ - ప్రత్యక్ష ప్రసారం - Minister Uttam Live - MINISTER UTTAM LIVE
Published : Jul 26, 2024, 4:00 PM IST
|Updated : Jul 26, 2024, 4:59 PM IST
Minister Uttam Kumar Reddy Live : బీఆర్ఎస్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనలో భాగంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. దానితోపాటు కన్నెపల్లి పంప్‌హౌస్, ఎల్ఎండీ రిజర్వాయర్ కూడా సందర్శించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బీఆర్ఎస్ బృందం చేపట్టిన కాళేశ్వరం పర్యటనపై హైదరాబాద్ జలసౌధలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అట్టహాసంగా కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టిందని మంత్రి ఉత్తమ్ విమర్శిస్తున్నారు. అంతకుముందే 16 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చేలా రూ.38 వేల కోట్ల అంచనాతో కాంగ్రెస్ సర్కార్ ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు చేపట్టిందని గుర్తు చేశారు. అలాంటి ప్రాజెక్టును కేసీఆర్ పక్కకు నెట్టారని మంత్రి విమర్శించారు. తుమ్మిడిహట్టి వద్ద నీరు లేదని ప్రాజెక్టు డిజైన్ మార్చేశారని, కేవలం కమీషన్ల కోసమే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని ఆరోపించారు. హైదరాబాద్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్వహించిన ప్రెస్‌మీట్‌ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం.
Last Updated : Jul 26, 2024, 4:59 PM IST